Oct 13,2023 21:10

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీనివాసులు

 పుల్లంపేట : స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం అందించేలా మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల కాంప్లెక్స్‌లోని తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీషతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రాజంపేట ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రానికి విచ్చేసిన కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులకు కృష్ణంపల్లి ఎంపిపి స్కూల్‌ విద్యార్థులు పూలు చల్లుతూ కోలాట నత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. బాల్య వివాహాలను నివారించాలనే అంశంపై చేసిన నత్యం ఆకట్టుకుంది. కొత్తపేట ఉన్నత పాఠశాల నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో ఆ పాఠశాల విద్యార్థులు చెట్ల పెంపకం, వాటి ప్రాముఖ్యతపై చేసిన నత్యాలు చెట్లను కాపాడాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం మండల కేంద్రానికి వచ్చిందన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జగనన్నకు చెబుదాం స్పందనను నిర్వహిస్తున్నా కూడా గ్రామ స్థాయిలో చిన్న చిన్న అంశాలు ఏవైనా జిల్లా అధికారుల దష్టికి రానివి జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఇక్కడ అందిన సంక్షేమ పథకాల అర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఏదైనా కొన్ని సాంకేతిక కారణాలతో అధికారులు సత్వరంగా పరిష్కరించలేని జిల్లా స్థాయి కానీ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ది అందిస్తోందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివద్ధి చెందాలని పేర్కొన్నారు. రెవెన్యూ పరంగా మండలంలోని ప్రతి చిన్న సమస్య స్థానిక తహశీల్దార్‌ నరసింహం కుమార్‌ స్థానిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం పట్ల కలెక్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి మండల అధికారి కూడా తమ తమ శాఖలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మండల పరిధిలోని కొన్ని శాఖల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ మండల స్థాయి జగనన్నకు చెబుదాం ఒక అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు. ప్రతి పథకం అర్హులకు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసులు, ఎంపిపి ముద్దా బాబుల్‌రెడ్డి, జడ్‌పిటిసి రామనాథం, సర్పంచ్‌ ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్‌ నరసింహకుమార్‌, ఎంపిడిఒ రఘురాం, ఎస్‌ఐ రఘురాం, మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ చైతన్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.