మదనపల్లె అర్బన్ : ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష ద్వారా ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. సోమవారం 30వ వార్డు కౌన్సిలర్ సరితా బాలగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంత్‌నగర్‌లో నిర్వహించిన జగనన్న సురక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏమి అవసరమో అది గ్రహించి, అందు కోసం వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక సిఎం జగన్ మాత్రమేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చిన ఘనత వైసిపి ప్రభుత్వాకే దక్కుతుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వి.మనూజారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మునిసిఫల్ వైస్ ఛైర్మన్ నూర్‌ఆజామ్ మార్కెట్‌యార్డు కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి, కౌన్సిలర్లు పాల్ చంద్రశేఖర్, బి.ఏ.ఖాజా, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, శ్యామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపిపి ముద్దా బాబుల్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. మాట్లాడుతూ కార్యక్రమంలో సుదర్శన్‌రెడ్డి, రెడ్డి పల్లి సర్పంచ్ ఎల్లయ్య, తహశీల్దార్ నరసింహకుమార్, ఎంపిడిఒ రఘురాం, ప్రకాశం, డిటి ప్రసన్నకుమారి, ఆర్‌ఐ నవీన్, ఎఒ ఖాన్, విఆర్‌ఒ రాధ, సుదర్శన్ రెడ్డి, ఎంపిటిసి ఆలం చెంగయ్య, రెడ్డిపల్లి యువజన యూత్ లీడర్ రొంపిచర్ల లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










