Jul 27,2023 21:31

సాలూరు : ధ్రువపత్రాలను అందజేస్తున్న వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించని అనేక సమస్యలకు శాశ్విత పరిష్కారం చేసి చూపిన గొప్ప కార్యక్రమం జగనన్న సురక్షమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని కృష్ణపల్లి, లక్ష్మీ నారాయణపురం సచివాలయాల్లో గురువారం జరిగిన సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న దరఖాసుదారులకు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగనన్న సురక్ష క్యాంప్‌ కార్యక్రమం ముఖ్యోద్దేశమన్నారు. అనంతరం అక్కడి నుంచి లక్ష్మీనారాయణపురం చేరుకుని ఆ సచివాలయం వద్ద జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన 11 రకాల అత్యవసరమైన దవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. క పరిష్కారం కాకుండా ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలపాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోమ్మి రమేష్‌, వైస్‌ ఎంపిపిలు సిద్ధ జగన్నాధరావు, బంకూరు రవికుమార్‌, ఎంపిపి మజ్జి శేఖర్‌, స్థానిక సర్పంచ్లు బోను రామినాయుడు, జక్కు ప్రవీణ్‌కుమార్‌, తహశీల్దార్‌ శివన్నారాయణ, ఎంపిడిఒ ఎస్‌.రమేష్‌, ఆత్మ చైర్మన్‌ ఎండ్రాపు తిరుపతిరావు, వైసిపి సీనియర్‌ నాయకులు బలగ నాగేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాలూరురూరల్‌ : జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజల పాలిట వరం అని వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌ తెలిపారు. మండలంలోని సారిక పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ గొర్లే సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతలక్ష్మి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ కల్లేపల్లి త్రినాధ నాయుడు, ఎంపిడిఒ ఎ.రమాదేవి, తహశీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపిటిసి సభ్యులు పూసూరు అమల, కురుకుట్టి ఎంపీటీసీ గేమ్మెల సుబ్బారావు, వైసిపి నాయకులు జి.రాజారావు, సువ్వాడ రామకృష్ణ, భరత్‌ శ్రీనివాసరావు, రాంబాబు, బీసూ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం : స్థానిక శ్రీ కోదండరామ కల్యాణమండపంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పి.గౌరమ్మ దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిదిమి సర్పంచ్‌ దమలపాటి ఉమామహేశ్వరరావు, తహశీల్దారు సిహెచ్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ జి జయంతి ప్రసాద్‌, మేజర్‌ పంచాయతీ ఇఒ వి.రామచంద్రరావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు డి.లలిత కుమారి, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ భోగి మాణిక్య చంద్రశేఖర్‌, ఎఎంసి డైరెక్టర్‌ కె.ఆంజనేయులు, నాయీ బ్రాహ్మణ డైరెక్టర్‌ బి లక్ష్మీనారాయణ, సచివాలయాల సిబ్బంది , గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని రంగంపేట, ఆర్‌.వెంకంపేటలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి కె.రామచంద్రరావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజానీకానికి మేలు చేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజలకు అక్కడక్కడ 11 రకాల ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవ ధ్రువపత్రాలు పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాక ప్రజలు ఎదుర్కొనే సమస్యను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ ప్రసాద్‌, తహశీల్దార్‌ ఎంవి రమణ, ఇఒపిఆర్‌డి కెకె వర్మ, ఆయా గ్రామ సర్పంచులు బి.భాస్కరరావు, పి.లక్ష్మి, వైసిపి నాయకులు బి.చిట్టిరాజు, ఇ.శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు