ప్రజాశక్తి-కర్లపాలెం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. సోమవారం కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులను కూడా తలుపుతట్టి మరీ మంచిచేసే కార్యక్రమమే జగనన్న సురక్ష అని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టు నాగాంజనేయరెడ్డి, ఏఎంసి చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్‌రెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, తహశీల్దార్ జి కేశవనారాయణ, ఈఓపిఆర్‌డి ఎలీషాబాబు తదితరులు పాల్గొన్నారు.
సంతమాగులూరు: ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతి సచివాలయంలో జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్, వైసిపి అద్దంకి ఇన్‌చార్జి, బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. సోమవారం మండలంలోని మామిళ్లపల్లి, మిన్నేకల్లు గ్రామాలలో జగనన్న సురక్ష కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ఆయా గ్రామాల సచివాలయ పరిధిలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తా ఉందన్నారు. ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ చింతా రామారావు, తహశీల్దార్ టీ ప్రశాంతి, ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










