
రైల్వేకోడూరు : ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కె.బుడుగుంటపల్లి గ్రామ సచివాలయ పరిది óలోగల సమతానగర్‌లో సర్పంచ్ దార్ల చంద్రశేఖర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు అందని వారు స్థానిక గ్రామ సచివాలయాలను సంప్రదిం చాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. పాఠశాలల్లో జరుగు తున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం సిఎం జగన్ పరిపాలన సాగి స్త్తున్నా రని అన్నారు. నవరత్నాలతో పేదలందరికీ సంక్షేమ పథకాలు అంది స్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యావ్యవస్థ నూతన ఒరవడి సృష్టించారని, నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పోయాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు కేటాయిం చార న్నారు. అమ్మఒడి పథకం పేద కుటుంబాలకు వరం లాంటిదని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఒకటవ తేది ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుం దన్నారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వైసిపిని ఆదరించి మరల సిఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రామ్మోహన్, ఎంపిడిఒ జాషువా, వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఎపి టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, డైరెక్టర్ గుణిశెట్టి ప్రశాంతి, జడ్‌పిటిసి రత్నమ్మ, , బిసి మానిటరింగ్ సభ్యులు సుబ్ర హ్మణ్యం, ఉపసర్పంచ్ తోటశివసాయి, సర్పంచులు రామకష్ణయ్య, గోపి, సూరి, బాబు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కంభంవారిపల్లి : అర్హత కలిగిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి వ్యక్తికి అందిస్తున్నట్ల జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతల రామ చంద్రరెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కమ్మవారిపల్లి పంచాయతీలో ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతు న్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకట రమణా రెడ్డి జడ్‌పిటిసి గజ్జలశతి, సీన్‌రెడ్డి, ఎంపిటిసి ఈశ్వరయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చంద్రగిరి ఎల్లయ్య, నాయకులు సి.కె ఎర్రమరెడ్డి పాల్గొన్నారు.