Nov 03,2023 23:09

ప్రజాశక్తి - సీతానగరం ప్రజా సమస్య లను తక్షణమే పరిష్కరిం చేందుకే జగనన్నకు చెబు దాం కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు. స్థానిక జెవికే ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం మండల స్థాయి జెకెసి కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసితోపాటు, ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, సహాయ కలెక్టర్‌ సి. యశ్వంత్‌ కుమార్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు.. ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లా డుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తుందన్నారు. ఎంఎల్‌ఎ జక్కంపూ డి రాజా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంద న్నారు. సమాజంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవాలని లక్ష్యం తో రేషన్‌ కార్డు, పెన్షన్‌, కార్పొరేషన్‌ రుణాలను నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు వి.స్వామినాయుడు, డాక్టర్‌ కె.వేంకటేశ్వ రరావు, డాక్టర్‌ ఎమ్‌. సనత్‌ కుమారి, ఎస్‌. మాధవరావు, ఎస్‌జిటి సత్యగోవిందం, పి.జగదాంబ, కె. విజయ కుమారి, ఎస్‌. అబ్రహం, వీణాదేవి, వి.నాగార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.