Jun 10,2023 21:18

మాట్లాడుతున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడప గడప: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
ప్రజాశక్తి కర్నూలు క్రైమ్

       ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.  నగరంలోని 3వ వార్డు 8వ సచివాలయం పరిధిలో ఉన్న చిన్న మార్కెట్, గనిగలి, మొగల్పురా వీధి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఆయన స్థానిక 3వ వార్డ్ కార్పొరేటర్ షాజహ పర్వీన్ వార్డు ఇన్చార్జి ఖాదర్ బాష స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వార్డు నాయకులు కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ ఫలాల లబ్దిని గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాల అమలును తమ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రారాజుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రామ లింగేశ్వర, స్థానిక వార్డ్ కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్ వార్డ్ ఇంచార్జి ఖాదర్ బాషా, వైసీపీ వార్డ్ ముఖ్య నాయకులు, కన్వీనర్లు ఖుద్ధుస్, చంద్ బాష, అంజు భాయ్, ముజహీద్, గౌసియా, అక్బర్, మాకబుల్, రాజు, శానవాజ్, ఫారజానా, కరీముల్లా, నజీర్ అహ్మద్, ఫరీద్, జమీర్, బురాన్, మునీర్, జుబైర్, అతీష్ ఎలక్ట్రికల్ ఎ.ఈ,లు మదన్ మోహన్,ఆర్.పి లు, సచివాలయం సిబ్బంది, అధికారులు, పలువురు వార్డు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.