Nov 16,2023 18:17

మండల పరిషత్‌ సమావేశంలో ఎంఎల్‌సి రవీంద్రనాథ్‌
ప్రజాశక్తి - పెనుమంట్ర

        ప్రతి సర్వసభ్య సమావేశంలో మినిట్స్‌ బుక్‌లో సమస్యలు రాసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారమవుతాయని ఎంఎల్‌సి వంకా రవీంద్రనాథ్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి (వాసురెడ్డి) అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు బ్యాంకు నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు లోన్‌ సదుపాయం పొందేవిధంగా సాయం అందిస్తామన్నారు. పెనుమంట్ర నుంచి జుత్తిగ హైస్కూల్‌ రోడ్డు అధ్వానంగా ఉందని జుత్తిగ సర్పంచి తమనంపూడి వీర్రెడ్డి చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎఇ యశ్వంత్‌ తెలిపారు. అనంతరం ఎంఎల్‌సి వంకా రవీంద్రనాథ్‌కు ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి, సభ్యులు, అధికారులు సన్మానం చేశారు. గత పదేళ్లుగా ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న వరలక్ష్మి ఇరగవరం బదిలీ కావడంతో ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ ఏలియమ్మ, వైస్‌ ఎంపిపి-2 అనిత, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.