ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని బంగారమ్మపేట పంచాయితీ శివారు గునిపూడిలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాబురావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజా సంక్షేమ దేంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పింఛన్లు, ఇల్లులు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.










