Jul 21,2023 22:32

ప్రజాశక్తి - ముసునూరు
              ప్రజా సంక్షేమ పథకాలతో పాటు వైద్య సేవలు పేదోడికి అందేలా వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని జెడ్‌పిటిసి సభ్యులు డాక్టరేట్‌ ప్రతాప్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన అన్నారు. మండలంలోని ముసునూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం జగనన్న సురక్ష ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి మండల అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు మాట్లాడారు.
ఇళ్ల పట్టాలివ్వాలని వినతి
స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సిపిఎం మండల కార్యదర్శి పిల్లి మురళీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జగనన్న సురక్ష కార్యక్రమంలో తహాశీల్దార్‌ దాసరి సుధకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ ఎన్నోఏళ్ల తరబడి కరెంట్‌, నీరు, రోడ్లు లేక, సరైన ఇళ్లు లేక పేదలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. గుడిసెలు వేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ముసునూరు రెవెన్యూ పరిధిలో నల్లచెరువు, కొత్త చెరువు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని, వాటిని ఆక్రమణల నుండి తొలగించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో మద్దాల బాబూరావు, పోట్రు శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీనివాసరావు, నక్కా రంగారావు, పేరిచర్ల తాతయ్య, రెడ్డి తిరుపతిరావు పాల్గొన్నారు.
ఉంగుటూరు : సర్పంచి బండారు సింధు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. అనంతరం ధ్రువపత్రాలు అందించారు. వికలాంగులకు రాయితీపై మూడు చక్రాల వాహనం అందించారు. పంచాయతీ కార్యదర్శి కాకర్ల గిరిధర్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అక్కుపల్లిగోకవరంలో సర్పంచి మిద్దే సత్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు పాల్గొని దరఖాస్తులు చేసుకున్నవారికి వివిధ ధ్రువపత్రాలను అందించారు.
జీలుగుమిల్లి : జగనన్న సురక్ష కార్యక్రమంలో ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ఎంపిపి కోర్స పోసమ్మ అన్నారు. మండలంలోని తాటియాకులగూడెం పంచాయతీలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం పరిసరాల్లో మొక్కలు నాటారు.
భీమడోలు : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులకు సత్వర చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఉంగుటూరు ఎంఎల్‌ఎ వాసుబాబు తెలిపారు. పూళ్ల గ్రామ సచివాల యం-3 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి దాయం సుజాతప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. కార్య క్రమ నిర్వహణ బాధ్యత స్వీకరించిన మండల కమిటీ బాధ్యులు ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతిదేవి మాట్లాడారు.
నూజివీడు రూరల్‌ : మండలంలోని మెర్సపూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపిడిఒ విఎ.విజరుకుమార్‌బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. 163 మందికి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, గ్రామ సర్పంచి పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : మండలంలో ఇప్పటివరకు 11 రకాల సర్టిఫికెట్లను 17293 మంది లబ్ధిదారులకు అందించినట్లు ఎంపిపి జ్యోతి తెలిపారు. మండలంలోని వేగవరంలో శుక్రవారం జగనన్న సురక్ష ముగింపు కార్యక్ర మాన్ని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ముదినేపల్లి : మండలంలోని పేయ్యేరు గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచి అల్లు సుశీలా అధ్యక్షతన సభ నిర్వహించారు.
కలిదిండి : మండలంలోని చిన తాడినాడలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ, ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు సర్టిఫికెట్స్‌ పంపిణీ చేశారు.
ద్వారకాతిరుమల : మండలంలోని ఎం నాగులపల్లి గ్రామ సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టి.నరసాపురం:మండలంలోని తిరుమలదేవి పేటలో శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు పలు రకాల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన వంద మంది జనసేన, టిడిపి పార్టీలో నుంచి వైసిపిలోకి చేరారు. వీరిని ఎంఎల్‌ఎ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పోలవరం : మండలంలోని వింజరంలో సర్పంచి వెంకటలక్ష్మి, ఎంపిపిల సంఘం జిల్లా అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.