ప్రజాశక్తి-జగ్గంపేట, అన్నవరం ప్రజాసేవే తమ కుటుంబానికి తెలిసిన విషయమని, ప్రజల సొమ్ము తమకెందుకని మాజీ సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా జగ్గంపేటలో మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ, నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో దీక్షాశిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ తన భర్త చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగులు, ప్రజలు ఆయన చేసిన అభివృద్ధి గమనించారు కాబట్టే తన భర్తకు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోమ్ మంత్రి చినరాజప్ప, వరుపుల సత్యప్రభ, కోర్పు లచ్చయ్యదొర, ఎస్‌విఎస్.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, వేములకొండ జోగారావు, జ్యోతుల లక్ష్మీదేవి పాల్గొన్నారు.










