Sep 21,2022 00:06

సమావేశంలో మాట్లాడుతున్న సిఐ విజరుకుమార్‌

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రజల రక్షణ కోసం బాధ్యతగా పనిచేయాలని మహిళా పోలీసులకు దార్వకా నేర విభాగం సిఐ విజరుకుమార్‌ సూచించారు. మంగళవారం నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ద్వారకా పోలీస్టేషన్‌ నేరవిభాగం ఆధ్వర్యాన మంగళవారం తోటగరువు కల్యాణమండపంలో సచివాలయాల మహిళా కానిస్టేబుళ్ళతో సమావేశం నిర్వహించారు. ఐదు వార్డుల పరిధిలో గల సచివాలయాల మహిళా పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ విజరుకుమార్‌ మాట్లాదుతూ ప్రస్తుతం నేరాలు జరుగుతున్న తీరు, వాటిని ఎలా ఛేధించాలి, నేరాలు జరగకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన విషయాలను వివరించారు. మీ ప్రాంతాల్లో ఉండే ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్జీవోస్‌ కార్యాలయాలు, లాడ్జీలు, బార్లు, వైన్‌ షాపుల వివరాలు, వాటిని నిర్వహించే వ్యక్తుల డేటాను సేకరించాలని సచివాలయ మహిళా పోలీసులకు సూచించారు. అద్దెకు ఉండే వారి డేటాను, ఫొటోలను వాలంటీర్ల ద్వారా సేకరించాలన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజల మధ్యకు వెళ్లి నేరాల అప్రమత్తతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్‌ ఎస్‌ఐలు రుక్మాంగధరరావు, ఆర్‌ఎ.కొండ, బి.నిహార్‌, సిబ్బంది పాల్గొన్నారు.