
ప్రజాశక్తి - రెడ్డిగూడెం : నవంబర్ 4, 5 తేదీల్లో మండలంలో జరిగే ప్రచార యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం మండల సీనియర్ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ మండలంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరలు, మహిళల రిజర్వేషన్ వంటి సమస్యలపై, కాంట్రాక్టు వర్కర్స్ కనీస వేతనం వంటి సమస్యలపై నవంబర్ 15న జరిగే సిపిఎం బహిరంగ సభకు మైలవరం నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జై.వెంకట్ రెడ్డి, ఉయ్యూరు కష్ణారెడ్డి, జి.అప్పి రెడ్డి, జి.వెంకటరెడ్డి, చంద్రరావు, బాబు, కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, రామిరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి పరమేశ్వరరావు పాల్గొన్నారు.