ప్రజా రక్షణభేరిని జయప్రదం చేయండిపోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం జిల్లా కార్యదర్శి
కడప అర్బన్ : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం నవంబర్ 1న కడప పాత బస్టాండ్ వద్ద నిర్వహించే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. శనివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ళు పూర్తి కావస్తోందని ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు పరిశ్రమ లాంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా రాష్ట్ర పారిశ్రామికాభివద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయా రైందని విమర్శించారు. అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య బిజెపి విద్వేషాలు రాజేస్తోందని మైనారిటీలకు భద్రత లేకుండా పోతోందని కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చిందని తెలిపారు. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలను రుద్దుతోందని విద్య, వైద్యం ప్రయివేటీకరించడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి భారంగా మారిందని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని, ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదానీలకు దోచిపెడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు. కష్ణ పట్నం, గంగవరం మేజర్ పోర్టులతో బాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా అదానికి నైవేద్యం పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసి, విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రామ్మోహన్, మనోహర్, సుబ్బమ్మ, దస్తగిరి రెడ్డి శ్రీనివాసులురెడ్డి, సత్యనారాయణ, అన్వేష్, శివకుమార్, చంద్రారెడ్డి, ఓబులేష్, సునీల్‌కుమార్ వెంకటసుబ్బయ్య, ఎమ్మార్ నాయక్, మహిళా సంఘం నాయకురాలు కామేశ్వరమ్మ పాల్గొన్నారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో... జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నవంబర్ 1న కడపలో జరిగే బస్సు జాత జయప్రదం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్.సిద్ధికి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు తెలిపారు. కోచింగ్ సెంటర్ లో నిరుద్యోగ యువతీ యువకులు కలిసి కరపత్ర ప్రచారం నిర్వహించారు. బద్వేలు : పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర నవంబర్ 1న బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో బద్వేల్ సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు పి.చాంద్‌బాష ,పట్టణ కమిటీ సభ్యులు గిలక రాజు, గోపవరం మండల కన్వీనర్ ఎస్.ఖాదర్ బాషా, సిపిఎం నాయకులు, ఇ. రమణయ్య ఆకాచంద్రశేఖర్, మస్తాన్, పాల్గొన్నారు. చాపాడు : ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం తలపెట్టిన ప్రజా రక్షణ బేరి బస్సు జాతా 31న మైదుకూరు చేరుకోనున్న నేపథ్యంలో బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ సిపిఎం మైదుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య నగర్‌లో కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ఎం షరీఫ్, సిపిఎం మండల నాయకులు గురవయ్య, బాలరాజు, సుధాకర్, జహంగీర్‌బాష లక్ష్మీదేవి, మేరీ, శివ, పోలయ్య హరి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం నవంబర్ 1న కడప పాత బస్టాండ్ వద్ద జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని శనివారం జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో పోస్టర్లు ఆవిష్కరించి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరనాల శివ నారాయణ, కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరేంద్ర, స్వామి, ఒబులేశ్, బాషా పాల్గొన్నారు.పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, నాయకులు