Oct 31,2023 22:27

ప్రజా రక్షణభేరిని జయప్రదం చేయండి : సిపిఎం

రాజంపేట అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిర్వహించే ప్రజా రక్షణభేరిలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జయ ప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బి బంగ్లాలో ప్రజా రక్షణభేరి పోస్టర్లను పత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు కావ స్తున్నా ప్రత్యేక హౌదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్‌ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్త రాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ,కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్‌ వంటి విభజన హామీలలో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయ లేదన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ప్రజలను నిట్ట నిలు వునా ముంచిన బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును తగనమ్మడానికి ప్రయ త్నిస్తోందని పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి ఏమాత్రం తీసిపోనంటూ కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం, గంగవరం మేజర్‌ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొ క్కటిగా అదానికి నైవేద్యం చెల్లిస్తున్నారన్నారు. రాజధాని నిర్మా ణం పూర్తి చేయడం చేతగాక వికేంద్రికరణ పేరుతో మూడు రాజధానుల జపం చేస్తున్నారన్నారు. కేంద్రం చెప్పినట్టల్లా ఆడుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని తెలి పారు. విద్యుత్‌ ఛార్జీల పెను భారం, మోటార్లకు మీటర్లు, ఆస్తి పన్ను, చెత్త పన్ను వంటి పెను భారాలతో ప్రజల నడ్డి విరుస్తు న్నారని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఓడించడానికి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిర్బంధ విధా నాలపై పోరాడటానికి తలపెట్టిన ప్రజా రక్షణభేరికి తరలిరావాలని కోరారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు నరసింహ, రమణ, ప్రసాద్‌, ఓబయ్య, లక్ష్మిదేవి, మధు, హరి పాల్గొన్నారు. పుల్లంపేట : ప్రజా రక్షణభేరిని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు ఎం.జయ రామయ్య, శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు స్థానిక బస్టాండ్‌ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఈ నెల 3వ తేదీన మదనపల్లెలో నిర్వహించే బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివ కుమార్‌రాజు, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు వనజ కుమారి, నాగలత, అంగన్వాడీ కార్యకర్తలు రోజ, శ్రీదేవి, ఎన్‌.పార్వతి, ఆశలత, వై.రమాదేవి, ఆశ వర్కర్స్‌ ప్రమీల, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు