Oct 27,2023 20:16

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

 చాపాడు : అసమానతలు లేని అభివద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా రక్షణభేరి బస్సు జాతాను, బహిరంగసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మైదుకూరులోని సుందరయ్య నగర్‌లో సిపిఎం మైదుకూరు మండల కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సు జాతాలను నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా 30న కర్నూల్‌ జిల్లా నుంచి బయలు దేరినబస్సుజాతా 31న సాయంత్రం మైదుకూరు,1న ఉదయం బద్వేల్‌, మధ్యాహ్నం కడపకు చేరుకుంటుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించే బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపరుస్తున్నాయని ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తున్నా ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రజల ఆస్తులన్నీ ఆదాని,అంబానీ లకు దోచిపెడుతుందన్నారు. మోటర్లకు మీటర్లు పేర్లతో ఆస్తి పన్ను నుంచి చెత్త పన్ను వరకు అనేక భారాలు మోపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని వాపోయారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు.వి.అన్వేష్‌, కె.సత్యం బి.మఠం మండల కార్యదర్శి గోవింద్‌, ఖాజీపేట సీనియర్‌ నాయకులు, వెంకటసుబ్బయ్య, గురయ్య, రాహుల్‌, లక్షుమయ్య, బాలరాజు, సుధాకర్‌, పోలయ్య, తామస్‌, ఇమామ్‌ పాల్గొన్నారు. కడప అర్బన్‌ : నవంబర్‌ 1న జరిగే ప్రజారక్షణ భేరీ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటసుబ్బయ్య, పి.చంద్రారెడ్డి, నగర కమిటీ సభ్యులు డి.ఎం. ఓబులేసు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో వివిధ ఆటో స్టాండ్‌ల వద్ద కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30వ తేదీ నుంచి మూడు ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కడపకు నవంబర్‌ ఒకటో తేదీన చేరుకుంటుందని తెలిపారు. పాత బస్టాండ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన హామీల అమలు కోసం, నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం, కడప ఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కు ప్రయివేటుకరణను ఆపాలని, రాయలసీమ అభివద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌తో యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికుల పొట్ట కొట్టే నూతన మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని వారు వాపోయారు. తక్షణమే ఆ యాక్ట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగడుతూ ప్రజలలో చైతన్యవంతులు చేయడం కోసం, వారి హక్కుల సాధన కోసం జరుగుతున్న ప్రజారక్షణ భేరీ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఇమామ్‌, ఉదరు పాల్గొన్నారు.