
ప్రజాశక్తి-విజయవాడ : ఈ నెల 15వ తేదీన సింగ్‌నగర్ ఎంబి స్టేడియం జరిగే సిపిఎం ''ప్రజారక్షణ భేరి'' బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రచార పాదయాత్ర కార్యక్రమం రాణిగారితోట 17,18 డివిజన్లలో ఆదివారం జరిగింది. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీసభ్యులు దోనేపూడి కాశీనాధ్ మాట్లాడుతూ...ఈ నెల 15న విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే సభను విజయవతం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. మూడోసారి మోడీ ప్రధాన మంత్రి కావాలని పవన్ కళ్యాణ్ కోరటం శోచనీయమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తమ్మిన చంద్రశేఖర్ , బి చిన్నారావు, డి వరప్రసాద్, కందుకూరి వెంకటేశ్వరావు, పాల్గొన్నారు. ప్రజారక్షణ భేరి సభను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీదేవి పిలుపునిచ్చారు. క్రైస్తవుల పై దాడులను ఖండించండి-మతోన్మాద బిజెపిని గద్దె దించండని పిలుపునిస్తూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాయికాపురం, సుందరయ్య నగర్, ఉడాకాలనీ 62,63వ డివిజన్‌లోని చర్చిల వద్ద ఆదివారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు, నాయకులు యన్.నాగేశ్వరరావు, బొంగు రాంబాబు,పి.సాంబిరెడ్డి, పాల్గొన్నారు.విజయవాడ అర్బన్ : ఈనెల 15న జరుగనున్న ప్రజా రక్షణ బేరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ బెంజిసర్కిల్ వద్ద గల భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి బి.బెనర్జీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వి.బి.రాజు, నాయకులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట : ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు, జగ్గయ్యపేట పట్టణ శాఖ కార్యదర్శి, న్యాయవాది దాసరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్, ఆర్టీసీ డిపో, కమల సెంటర్, బస్టాండ్, మున్సిపల్ కూడలి, బస్టాండ్ రోడ్డు, పాతగడ్డ ప్రాంతాల్లో ఆదివారం ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలను కోరుతూ గోడ ప్రతులతో, కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రజా రక్షణ భేరి కార్యక్రమానికి అఖిలభారత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాంప్రసాద్, రావెళ్ల శేషు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం : విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివి.కృష్ణ మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండపల్లి టౌన్ కార్యదర్శి ఎం.మహేష్, నాయకులు ఎ.విఠల్ రావు, వి.మురళీమోహన్, ఇర్లా కొండలరావు ఎస్‌కె భాషా, కె.నారాయణ, ఎన్ బాబ్జి, కవి తదితరులు పాల్గొన్నారు. వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయిలో సిపిఎం కార్యాలయంలో ప్రజారక్షణభేరీ పోస్టర్స్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సిహెచ్.హనుమంతరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్, మండల కమిటీ సభ్యులు కె.కొండయ్య పాల్గొన్నారు. నేడు బైక్ ర్యాలీనీ
ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరగనున్న ప్రజా రక్షణ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ 6న వత్సవాయి మండలంలో సిపిఎం మండల శాఖ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు కోరారు. వత్సవాయిలో ప్రారంభమై ఈ బైక్ ర్యాలీ వేములనర్వ, ఖమ్మంపాడు, తాళ్లూరు, మాచినేని పాలెం, కాకరవాయి, పాత వేమవరం, కొత్త వేమవరం, డబ్బాకుపల్లి, పెం ట్యాల వారి గూడెం, పోలంపల్లి గ్రామాలకు వరకు కొనసాగుతుందని తెలిపారు. వీరులపాడు : దొడ్డ దేవరపాడు గ్రామంలో బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చాట్ల రవి మండల కమిటీ సభ్యుడు పల్లె కంటి బాబూరావు హరిబండ్ల ఆనందరావు అరిగల గోపయ్య పత్తిపాటి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలు గ్రామాల్లో సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని గోడపత్రికలు అంటించారు. సిపిఎం మండల కార్యదర్శి చాట్ల రవి ప్రారంభించిన కార్యక్రమంలో పల్లె కంటే బాబు ఆనందరావు రాజేష్ లాల్ అహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. తిరువూరు : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా రక్షణ వాల్ పోస్టర్లను అయన పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు పూర్తిగా వైపల్యం చెందాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంతంగి శ్రీనివాసరావు, బి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.