ప్రజాశక్తి-కాకినాడ రూరల్ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని రాష్ట్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ భేరిని యాత్రలను జయప్రదం చేయాలని పలువురు కోరారు. ఇంద్రపాలెం అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో యాత్ర పోస్టర్, కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం రూరల్ మండల కమిటీ కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వర రావు మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలనే కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తోందన్నారు. నవంబర్ 5న కాకినాడలో జరుగునున్న బహిరంగ సభకు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి విజరు కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, తొట్టిపూడి రాజా, అంకం సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి చందర్రావు, కృష్ణాజీ, శీలం చిన్న, జి.పద్మ, లక్ష్మి, అమ్మాజీ, నాగు, భవాని, రమణమ్మ, దేవి, పైడమ్మ, సావిత్రి పాల్గొన్నారు.










