ప్రజాశక్తి - తాళ్లరేవు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఈ నెల 5న కాకినాడలో చేపట్టిన ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, వల్లు రాజబాబు కోరారు. ప్రజాసంఘాల భవనంలో గురువారం నిర్వహించిన సిపిఎం జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అధిక ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని, రాష్ట్రానికి బిజెపి తీరని అన్యాయం చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో లేవని, మతోన్మాదం పేరుతో ఓట్లు దండుకున పరిస్థితి కేంద్రంలో ఉందన్నారు. రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించి వేస్తున్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు నోరు మెదపడం లేదనిఅన్నారు. ఈ కార్యక్రమంలో చల్ల సంతోష్ కుమార్, గుత్తుల చెన్నయ్య, దడాల అబ్బులు, పాలెపు ఈశ్వరరావు, పలివెల సింహాచలం, రాయుడు సత్యనారాయణ, పిల్లి నాని, కె.సత్తిరాజు, వి.సత్యనారాయణ, త్రిమూర్తులు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఏలేశ్వరం మండల కేంద్రంలోని ఆరో వార్డులో సిపిఎం ప్రజా రక్షణ భేరి పోస్టర్‌ను మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీరా కుమారి, మోరంపూడి సునీత, మాస రమణ, బుక్కా రత్నం,శిడగం పైడితల్లి, బూర్ల కాంతం, బొడ్డు భద్రం, పెద్దపాటి అప్పారావు, గాంధారపు ఉమాశంకర్ రావు, కార్యకర్తలు ఉన్నారు.










