ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయండి సీపీఎం ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ
ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయండి
సీపీఎం ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని సమగ్ర దేశాభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరిని జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపు నిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో మంగళవారం ప్రజారక్షణ భేరి కరపత్రాలను, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ బిజెపి అధికారం చేపట్టిన ఈ పదేళ్ల కాలంలో బుల్ డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను నడిరోడ్డు మీద నగంగా ఊరేగించి గొప్ప ఘనతగా చెప్పుకుంటున్న కీచకులకు మద్దతి వ్వడం మోడీ నిరంకుశ పాలనకు, ద్వంద నీతికి నిదర్శనమన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం, ఆకలి, మహిళలపై దాడులు, మత విద్వేషాలు అధికమైపో యాయన ా్నరు. పెద్దల సభలో నల్ల చట్టాలను ఆమోదిస్తూ, కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందంటూ మండి పడ్డారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి జగన్ ప్రభుత్వం మద్దతు పలకడం శోచనీయ మన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, రాష్ట్రాన్ని పూర్తిగా గాలికొదిలేశా యనీ, ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం కోసం కుస్తీలు పడుతున్నాయే తప్ప, ప్రమాదంలో పడ్డ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు ముందడుగు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బిజెపి విష కౌగిలి నుంచి వైసిపి, టిడిపి, జనసేన బయటకు రావాలని సూచించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని సమగ్ర దేశాభివద్ధి కోసం మహోద్యమం చేస్తున్న సీపీఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభ నవంబరు 15న విజయవాడ వేదికగా జరుగుతుందన్నారు. దీనికి సంఘీ భావంగా నవంబర్ 5న ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర శ్రీకాళహస్తికి చేరుకుంటుందన్నారు. శ్రీకాళహస్తి ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా బస్సు యాత్రకు సంఘీభావం తెలిపి, బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య, గెడి వేణు, సంక్రాంతి వెంకటయ్య, కుమార్ పాల్గొన్నారు.










