ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్
విజయవాడలో నిర్వహిస్తున్న సిపిఎం ప్రజారక్షణ భేరి కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ స్పెషల్, ఎపి ఎక్స్‌ప్రెస్, ఎల్‌టిటి, కోరమండల్, ఉదరు ఎక్స్‌ప్రెస్‌లకు వేలాదిమంది తరలివెళ్ళారు. ఈ సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మణి, బి.వెంకటరావు, డి.అప్పలరాజు నాయకత్వంలో మంగళవారం పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్ళిన సందర్భంగా సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌లు వీడ్కోలు పలికారు. అలాగే ప్రజా రక్షణ భేరి సభకు విశాఖపట్నం నుంచి విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో 300 బైకులతో 600 మంది కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు దీక్షా శిబిరం నుంచి తరలివెళ్లినట్టు చెప్పారు.
అనకాపల్లి : అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజా రక్షణ భేరి పేరుతో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 15న బుధవారం విజయవాడలో జరుగు భారీ బహిరంగ సభకు ఆ పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. జిల్లా నుంచి మంగళవారం బయలుదేరి వెలుతున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సందడి వాతావరణం నెలకొంది. వారిని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శంకర్రావు, గంటా శ్రీరామ్, అల్లు రాజు, చలపతి దగ్గరుండి ట్రైన్ ఎక్కించారు.
అచ్యుతాపురం : విజయవాడలో బుధవారం జరిగే సిపిఎం బహిరంగ సభకు అచ్యుతాపురం మండలం నుంచి పార్టీ నాయకులు అభిమానులు బయలుదేరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండల నాయకులు ఆర్.రాము, కర్రి అప్పారావు, ఎస్.రాము నాయుడు, కనుమ నాయుడు, బి.రామ్‌కుమార్, కే.బాబురావు, కె రామకృష్ణ వెళ్లారు.
ప్రజా రక్షణ భేరిపై ప్రచారం
పరవాడ : పరవాడ సినిమా హాల్ జంక్షన్‌లో మంగళవారం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పి మాణిక్యం, కె.నాయుడు, జి. శ్రీను పాల్గొన్నారు.