Nov 01,2023 23:18

ప్రజాశక్తి - అద్దంకి 
జిల్లాలో ఈనెల 7, 8తేదీల్లో జరిగే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య కోరారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం ప్రజారక్షణబేరి ప్రచారం పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గంగయ్య మాట్లాడుతూ ఈనెల 7న ప్రకాశం జిల్లా నుండి బాపట్ల జిల్లా మేదరమెట్లలోకి ప్రజారక్షణభేరి బస్సు యాత్ర బృందం వస్తుందని చెప్పారు. అనంతరం అద్దంకిలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. అక్కడి నుండి పల్నాడు జిల్లాలోకి వెళుతుందని చెప్పారు. 8న ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా పర్చూరులోకి మరల ప్రజారక్షణ బేరి బస్సు యాత్ర బృందం వస్తుందని తెలిపారు. పర్చూరులో బహిరంగ సభ అనంతరం చీరాల, బాపట్ల, బట్టిబ్రోలులో బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు. బస్సు యాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి రమాదేవి, సిపిఎం రాష్ట్ర నాయకులు కె ఉమామహేశ్వరరావు, కె ప్రభాకరరెడ్డి, వి కృష్ణయ్య, కె రమాదేవి పాల్గొంటారని తెలిపారు. ప్రజాసమస్యలపై యాత్ర బృందానికి వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.