Nov 10,2023 00:17

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం
విజయవాడలో ఈ నెల 15న సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యాన గురువారం ప్రచారం నిర్వహించారు. పోస్టర్ల ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ చేశారు.

తగరపువలస: స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ జోన్‌ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ, రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, ఆ పార్టీకి కొమ్ము కాసే పార్టీలను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎంను బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, నీలాతి రాము తదితరులు పాల్గొన్నారు
ములగాడ : సిపిఎం ప్రజారక్షణ భేరి ర్యాలీలో పాల్గొనే రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల శిక్షణ 62వ వార్డు పరిధి దుర్గానగర్‌ గ్రౌండ్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ శిక్షణను డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు ప్రారంభించారు. వాలంటీర్లకు డివైఎఫ్‌ఐ జిల్లా నాయుకులు శ్రావణ్‌, ఎస్‌.వాసు, వి.సాయి కవాతు శిక్షణ ఇచ్చారు. సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడుతూ, సిపిఎం బస్సుయాత్ర ముగింపు సభ రోజున విజయవాడలో జరిగే మహాప్రదర్శనలో వేలాది రెడ్‌ షర్టు వాలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురంజోన్‌ నాయుకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, పెంటారావు, ఎల్‌.కృష్ణ, అర్జునరావు, బి.జగ్గునాయుడు, డి.రాజేష్‌, జి.నరేష్‌, లెనిన్‌ తదితర్లు పాల్గొన్నారు.
సింహాచలం: సిపిఎం గోపాలపట్నం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన సింహాచలం సంతలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.వెంకటరావు, ముద్దాడ వరప్రసాద్‌, పార్టీ సానుభూతిపరులు, నాయకులు పాల్గొన్నారు.