
ప్రజాశక్తి - ఆరిలోవ : విజయవాడలో ఈ నెల 15వ తేదీ నిర్వహించే ప్రజా రక్షణ భేరి భారీ బహిరంగ సభకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆరిలోవ సిఐటియు కార్యాలయం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆరిలోవ జోన్ కార్యదర్శి వి.నరేంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడి, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఏ తరగతి ప్రజానీకానికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకురావడం కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరీ పేరుతో బస్సు యాత్ర చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు పి.శంకరరావు, బి.సూర్యమణి, వై.అప్పారావు, కె.సత్యనారాయణ, అన్నపూర్ణ, మరిపి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
మాడుగుల: సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో నిర్వహించనున్న ప్రజా రక్షణ భేేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కె.భవాని కోరారు. మంగళవారం శంకరం పంచాయతీలో పోస్టర్ ఆవిష్కరించి, విస్తృతంగా ప్రచారం చేశారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజారక్షణభేరి యాత్ర, సభలను జయప్రదం చేయడం ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలన్నారు. కార్యక్రమంలో గెమ్మిల ఈశ్వరరావు, ఆగరి లక్ష్మీనారాయణ, మడగల శివకుమార్, లోత ఈశ్వరరావు, ముర్ల సోములు, అగరి పైడితల్లమ్మ, అగరి దేముడమ్మ లోత మహేశ్వరి పాల్గొన్నారు