
ప్రజాశక్తి-ఉలవపాడు : లౌకికవాదం,ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరి పేరుతో ఈనెల 15న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ నవంబర్ 30న ఆదోనిలో ప్రారంభమైన బస్సు యాత్ర నేడు సాయంత్రం 4గంటలకు కందుకూరు వస్తుందని సిపిఎం ఉలవపాడు మండల కార్యదర్శి జీవీబీకుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 5 గంటలకు సభ జరుగుతుందని, ఈ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం ప్రజారక్షణభేరి వాల్ పోస్టర్ ను స్థానిక సిపిఎం నాయకులు ఉలవపాడు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కందుకూరు లో జరిగే సభలో సిపిఎం మాజీ కార్యదర్శి పి.మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.ప్రభాకర్ రెడ్డి,ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కష్ణయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ హాజరవుతారన్నారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం ఉలవపాడు మండల కమిటీ సభ్యులు కొమరగిరి శేషమ్మ, ఏలూరు నాగార్జున, ఎం ప్రహ్లాద్ ,ప్రజా సంఘాల నాయకులు మిట్టనోసల సుభా పాల్గొన్నారు.