ప్రజాశక్తి-తాళ్లరేవు
విజయవాడలో ఈనెల 15న జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కె.ఎస్.శ్రీనివాస్, సిపిఎం మండల కమిటీ కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల భవనంలో శనివారం వళ్ళు రాజుబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఓడించాలని, బిజెపిని సపోర్ట్ చేసే అన్ని పార్టీలను ఓడించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై పోరాడాలని, దానికోసం సిపిఎంని బలపరచాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా పోలవరం అభివృద్ధి ఆగిపోయిందని, పోలవరం నిర్వాసితులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర అభివద్ధి కోసం ప్రజా రక్షణ భేరి లో భాగంగా మూడు ప్రాంతాల వారీగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు చేశారు. కరెంటు యూనిట్ రూ.1కే ఇవ్వాలని, యూనిట్ 300 యూనిట్ల వరకు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, గ్యాస్ రూ.400 కే ఇవ్వాలని, రూ.60కే పెట్రోల్ అందించి, ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్లు చేశారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈనెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలెపు ఈశ్వర రావు, దడాల అబ్బులు, దుప్పి అదష్టదీపుడు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, బీర వెంకటేశ్వరరావు, పులుపుకూర కష్ణ, మురమళ్ళ శ్రీను, దడాల సత్తిపండు, ఉబ్బన శ్రీనివాసు పాల్గొన్నారు. పిఠాపురం : ప్రజా రక్షణ భేరి భాగంగా ఈనెల 15న సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కె.సింహాచలం పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని విరవ పి హెచ్‌సి కాలనీ కమ్యూనిటీహాల్ వద్ద శనివారం చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించారు. సింహాచలం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న అన్యాయంపై, అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణభేరి యాత్ర ముగింపుగా ఈనెల15న విజయ వాడలో నిర్వహించే బహిరంగసభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు హాజరువు తున్నారని ఈ బహిరంగ సభను ప్రజలంతా జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు దడాల నాగ వెంకటలక్ష్మి, డెక్కల లాజరు, బుల్లబ్బాయి, రాఘవ, బాబి, చంటి, నాగేశ్వరావు సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.