
ప్రజాశక్తి కొమరాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టేలా చేపడుతున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం గుమడ సంతలో సిపిఎం ఆధ్వర్యంలో యాత్ర సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర జరుగుతుందని, వీటిని జయప్రదం చేయాలని సాంబమూర్తి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సమస్యలపై ఈ ప్రజా రక్షణభేరి బస్సుయాత్ర ఈనెల 30న కురుపాంకు చేరుకుంటుందన్నారు. కావున ఈ బహిరంగ సభకు ప్రజానీకమంతా రావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉపేంద్ర, లక్ష్మీనాయుడుతో పాటు గిరిజన ప్రజలు పాల్గొన్నారు.