
ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : ఈనెల 30న అసమానతల్లేని అభివృద్ధి కోసం పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగబోవు ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, నాయకులు పాకల సన్యాసిరావు, కార్యకర్తలు పట్టణంలోని 24,25వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు యాత్రలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొంటారని, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సీతంపేట: అసమానతల్లేని రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుతూ సిపిఎం ప్రజా రక్షణ బస్సు యాత్రన ఈనెల 30న సీతంపేటలో ప్రారంభమవుతుందని, దీన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు కోరారు. ఈ యాత్రను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రారంభిస్తారన్నారు. ఈ యాత్రకు పార్టీ రాష్ట్ర కార్య దర్శి వి.శ్రీనివాస్ రావు నాయకత్వం వహిస్తారన్నారు. మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు.
కురుపాం : ఈనెల 30న జరిగే సిపిఎం ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, ఊలక వాసుదేవరావు అన్నారు. మండలంలోని గాంధీనగర్‌లో ప్రజా పరిరక్షణ భేరి సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైన వైసిపి, జనసేన, టిడిపి పార్టీలను ఎండగట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రజా రక్షణ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నాయకులు కె. సుబ్బారావమ్మ, ఎస్.పుణ్యవతి, ఎం.కృష్ణమూర్తి పాల్గొంటారని అన్నారు. కావున పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు సిద్ధమవుతున్న వేదిక
కురుపాం : ఈనెల 30 తేదీన నియోజకవర్గ కురుపాం జరుగునున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు శనివారం రాత్రి దగ్గరుండి సభా వేదిక కురుపాంలో ప్రధాన రహదారి, బహిరంగ సభ జరుగు రావాడ కూడలి వరకూ సిపిఎం జండాలను కట్టిస్తూ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పుణ్యవతి, కె.సుబ్బారావమ్మ, ఎం.కృష్ణమూర్తి పాల్గొంటున్నారని, కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.