Nov 08,2023 16:35

ప్రజారక్షణ భేరి బహిరంగ సభ గోడపత్రికను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజా రక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయండి: సిపిఎం
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్

    ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే ప్రజా రక్షణ బేరి బహిరంగ సభకను జయప్రదం చేయాలని కార్మిక ,కర్షకులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం ఆవరణలో  గోడ పోస్టర్ ను ఆ పార్టీ నాయకులు కె భాస్కర్ రెడ్డి, పి పకీర్ సాహెబ్ ,టి గోపాలకృష్ణ, వి శ్రీనివాసులు ,ఎం కర్ణ ,ఆంజనేయులు, నాగన్న, ఈశ్వరమ్మ, హుస్సేనమ్మ, రంగమ్మ ,నరసింహ, ఏసన్న, తదితరులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజా రక్షణ బేరి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని కావున అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. నేడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన హక్కులను ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు ,అమరావతి, రాజధాని, కడప స్టీల్ ప్లాంట్, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నిధులు కేటాయింపు రాబట్టడంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యం చెందడమే కాకుండా నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయారని వారు ఆరోపించారు, రాష్ట్రంలో అధికార దాహం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం కేంద్రం లోని నరేంద్ర మోడీ దగ్గర ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వారు ఆరోపించారు, రాష్ట్రంలో 400 మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం 100 మండలాలను మాత్రమే కరువు మండలాలు ప్రకటించడం విచారకరమన్నారు ,కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఎకరాకు రూ 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, రైతు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, ఉపాధి కూలీలు వలసలు పోకుండా నివారించేందుకు కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు పెట్టాలని వారి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తును ప్రైవేటీకరణ చేసి విద్యుత్ చార్జీలను హద్దు అదుపు లేకుండా పెంచడమే కాకుండా విపీరితమైన విద్యుత్ కోతలు పెడుతున్నారని వాటి మూలంగా రైతులకు 9 గంటలు సక్రమంగా కరెంట్ అందడం లేదని వారు ఆరోపించారు. జగనన్న కాలనీ గృహ వినియోదారులు ప్రభుత్వమిచ్చే నిధులు సరిపోక అప్పలపాలవుతున్నారని వారు ఆరోపించారు ,జగనన్న కాలనీలో సరైన మౌలిక వసతులు లేవని వారు తెలియజేశారు ,రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రెండున్నర సెంట్లు స్థలం ఇచ్చి పక్క గృహాల నిర్మాణం కోసం రూ 5 లక్షలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ,ప్రజా పంపిణీ  కేవలం బియ్యం మాత్రమే పంచుతున్నారని బియ్యంతో పాటు 15 రకాల నిత్యవసర సరుకులు అందించాలని  డిమాండ్ చేశారు , మున్సిపాలిటీ కార్మికులు, ఆశ ,అంగన్వాడి ,మధ్యాహ్నం భోజనం, గ్రామ సేవకులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కార్మికుల వేతనాలను  రూ 26 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు, రాజకీయ ప్రత్యామ్నాయ విధానాల కోసం  సిపిఎం పోరాడుతుందని అందుకు ప్రజలు ఉద్యమాల్లో కలిసి రావాలని వారు కోరారు.