42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్
ప్రజాశక్తి-పెందుర్తి : కార్మికులు, కర్షకులతోపాటు అన్ని వర్గాల ప్రజల గొంతుక వినిపించేది ప్రజాశక్తి ఒక్కటేనని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ అన్నారు. అన్యాయాలు, అక్రమాలతోపాటు ప్రజాసమస్యలపై నిర్భయంగా వార్తలను రాసేది ప్రజాశక్తి మాత్రమేనని కితాబునిచ్చారు. గురువారం ప్రజాశక్తి దినపత్రిక 42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామమని, ఈ పత్రికకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని స్పష్టం చేశారు. 42వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రజాశక్తి యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసిలు, సర్పంచులు నాయకులు పాల్గొన్నారు










