మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్ : ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వ అరాచకాలను నియంత్రించవచ్చునని మాజీ మంత్రి, టిడిప ిపొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మంగళవారం నర్సీపట్నం వచ్చి అయ్యన్నపాత్రుడిని పరామర్శించి, సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడం వల్లే అయ్యన్నపాత్రునిపై వైసిపి ప్రభుత్వం కక్షగట్టి, అక్రమ కేసులు బనాయించిందన్నారు. అయ్యన్నకు పార్టీతోపాటు తామంతా వెన్నంటే ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు.










