Sep 30,2023 21:09

ఆరోగ్యసురక్ష ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా

 ప్రజాశక్తి - కడప అర్బన్‌ /కడప : ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజల ఆరో గ్యమే ధ్యేయంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్నారని, పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, మేయర్‌ కే. సురేష్‌ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక మారుతీ నగర్‌ ప్రాంతంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికీ వైద్యం కూడా వారి గడపకు అందించాలనే ఆలోచనతోనే ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టారన్నారు. ప్రతి వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, గృహరథసారథులు 15 రోజుల నుంచి ప్రతి గడపకూ వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడే ఇంటివద్దే పరీక్షలుచేయించారని చెప్పారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి మరి ఎక్కడైనా అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉందో ఆ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రాంతంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు.15 రోజుల నుంచి సర్వే చేసి తిరిగిన ప్రాంతాల వారందరికీ ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో స్పెషలిస్ట్‌ డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించారని చెప్పారు. మహిళలకు సంబంధించి గైనకా లజిస్టులు, ఆర్థోపెడిక్‌ డాక్టర్లు, చిన్నపిల్లల నిపుణులు, ఉన్నారని, కంటికి సంబం ధించి, ఇతర ఐదు మంది డాక్టర్లు కూడా ఉన్నారన్నారు. ఈ శిబిరంలో వారి వారికి సంబంధించిన 11 రకాల పరీక్షలను వారికి చేస్తారన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఈ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ద్వారా అందించాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నగర మేయర్‌ కె. సురేష్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగ నన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా అని ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నామన చెప్పారు. తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్‌ బి అంజాద్‌బాషా, నగర మేయర్‌ కె.సురేష్‌ బాబు లతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రిబ్బన్‌ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీన్‌ చంద్‌తోపాటు సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, నాయకులు అఫ్జల్‌ ఖాన్‌, నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కష్ణ, జిలాని, మల్లారెడ్డి, కిరణ్‌, కార్పొరేటర్లు రామచంద్రయ్య , రవీంద్రనాథ్‌ రెడ్డి, రిజ్వాన్‌, రామకష్ణారెడ్డి త్యాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.నాగరాజు, వైద్యులు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.