Feb 13,2022 11:10

నిన్ను కలిసిన మరుక్షణం నుంచి
నీ గురించి ఆలోచనలే
నిన్ను తలవని క్షణం లేదు
నీ పలకరింపులోని పరిమళం
తావిలా నన్ను అంటిపెట్టుకొని
అలరిస్తూ ఉంది
నీ అమాయక వదనంతో
నన్ను మురిపించి
దివ్యమైన మనస్సుతో
నన్ను మైమరపించి
మౌనంతో నన్ను గెలిచిన
నీవు గుర్తొస్తే
గుండె లయ తప్పుతోంది
తనువెల్లా పులకిస్తోంది
నేనంతా నువ్వైన నన్ను నేను
ఏనాడో మర్చిపోయాను
నీలాల నింగిలోకి చూస్తే
ప్రతి తారలోనూ అందమైన నీ రూపే
గుప్పెడంత గుండెలో
గువ్వలా గూడుకట్టుకున్నావుగా!
ఒట్టేసి చెబుతున్నా!
మనసు మాట చెబుతున్నా
నా జీవితంలో
మధుర క్షణాలంటూ
ఏమైనా ఉన్నాయంటే
అవి నీతో గడిపినవే...
 

వేమూరి శ్రీనివాస్‌

99121 28967