May 10,2023 01:27
పర్చూరులో పరివర్తనా భవనాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరులో జరుగుతున్న పరివర్తనా భవన పనులు సత్వరం పూర్తి చేసి నియోజకవర్గంలోని దళితులంతా ఉపయోగిం చు కోవాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ చైర్మన్‌ ఎం విక్టర్‌ ప్రసాద్‌ కోరారు. పర్చూరు లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం సహకారంతో భవనం నిర్మాణ పనులు ప్రారంభించినట్లు కమిటీ సభ్యులు వివరించారు. నిధుల లేమి కారణంగా పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని చెప్పారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి సునజా చౌదరి రూ.10 లక్షలు ప్రహరీ గోడ నిర్మాణానికి, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్‌ రూ.5 లక్షలు ఫ్లోరింగ్‌కు కేటాయించార న్నారు. మంజూరైన నిధులతో త్వరగా పనులు పూర్తి చేయాలని, అవసరమైతే సంబంధిత అధికారులతో మాట్లాడతామని విక్టర్‌ ప్రసాద్‌ హామీ ఇచ్చారు. ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన వెంట మండల పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జూపూడి మార్కు, స్వరాజ్‌, ఆనంద్‌, ఎన్‌ కిషోర్‌, ఎస్‌ఐ చెంచు ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.