ప్రజాశక్తి-కంచికచర్ల
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావించి జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం, అభివద్ధి పట్టించుకోలేదన్నారు. టిడిపి కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందించారన్నారు . అభివద్ధి పేరుతో టిడిపి నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి షేక్ బషీర్, సర్పంచ్ యద్దనపూడి ఆనంద జ్యోత్స్న, ఎంపీటీసీ కర్ల రాధిక, రామకష్ణ, వైసిపి నాయకులు చింతా రవి, మార్త శ్రీనివాసరావు, కార్యదర్శి మీర్జావలి తదితరులు పాల్గొన్నారు.










