Oct 01,2023 16:39

ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు

పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం
ప్రజాశక్తి పగిడ్యాల

     ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జెడ్పిటిసి పుల్యాల దివ్య, మాజీ జెడ్పిటిసి, మండల వైసిపి అధ్యక్షులు పుల్యాల నాగిరెడ్డి  , సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న  అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పగిడ్యాల స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామంలోని ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీధులను మురికి కాలువలను శుభ్రం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామని వారు అన్నారు.  చెత్తాచెదారం మురికి కాలువలో వేస్తే మురుగునీరు నిలువ ఉండిపోయి దోమలు వృద్ధి చెంది దోమ కాటుకు గురై అనారోగ్యన బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. చెత్తను  మీ ఇంటికి వద్దకి వచ్చిన గ్రామపంచాయతీ బండి వచ్చినప్పుడు బండ్లో వేయాలని గ్రామస్తులకు సూచించారు.   పరిశుభ్రమైన నీటిని త్రాగాలని కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం చేకూర్స్తుందని వారన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు దుశ్యాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, ఈ ఓ ఆర్ డి నాగేంద్రయ్య, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీ ఓ మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్రారెడ్డి, వీఆర్వో నాగన్న,  సచివాలయాల సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

సన్మానిస్తున్న దృశ్యం
సన్మానిస్తున్న దృశ్యం