
ప్రజాశక్తి- డెంకాడ : పరిశ్రమలతోనే యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని టిడిపి రాష్ట్ర పోలెట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. మండలంలోని అక్కివరం గ్రామంలో కంది రమాదేవి పేరుమీద మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు ఏర్పాటు చేసిన జయ చంద్ర మిల్క్ ప్రోడక్ట్‌ను అశోక్ గజపతిరాజు మంగళవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుందన్నారు. ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలన్నారు. దీని వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఇక్కడ పాలతో ప్రతి ఒక్క వస్తువు తయారు చేసి సప్లరు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కర్రతో బంగారు రాజు, మాజీ ఎంపిపి మహంతి చిన్నంనాయుడు, నియోజకవర్గంలో నాలుగు మండలాల టిడిపి మాజీ ఎంపిపిలు, మాజీ జెడ్‌పిటిసిలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.