Feb 13,2023 23:58

దగ్ధమవుతున్న పీచు

ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం:మండలంలోని కొరుప్రోలు గ్రామంలో పీచుపరిశ్రమలో ఆరు బయట ఆర బెట్టిన పీచు దగ్ధమైంది. సోమవారం ఉదయం పద కొండు గంటల సమయంలో శ్రీ వేంకట పద్మావతి శ్రీ వేంకటేశ్వర క్వాయర్‌ ప్రొడక్ట్‌ ఇండిస్టీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ తీగల నుండి పడిన అగ్గి రవ్వలే ప్రమాదానికి కారణమయ్యాయని కూలీలు తెలిపారు. నక్కపల్లి, యలమంచిలి అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నింనా గాలి వేగంగా వీయడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. గ్రామస్థులు, కూలీలు తమ వంతు మంటలార్పేందుకు కృషి చేశారు. సుమారు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయల ఆరబెట్టిన పీచు అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్లు యజమాని బిక్కిన శ్రీను తెలిపారు. సుమారు నాలుగు గంటల సమయం పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.