జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏసుదాసు
ప్రజాశక్తి - ఉంగుటూరు
భారీ పరిశ్రమల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేందుకు అవసరమైన పద్దతులను పాటించాలని పరిశ్రమల కేంద్రం జిల్లా జనరల్ మేనేజర్ పి.ఏసుదాసు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నల్లమాడులో రుద్రా టెక్నోఫీడ్స్, నారాయణపురంలో ఫ్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ పరిశ్రమలను సందర్శించారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో అధిక విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమలను సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ హైరేటింగ్, లోరేటింగ్ మోటార్లకు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్‌లను వినియోగిస్తే విద్యుత్‌ను మూడోవంతు ఆదా చేసుకోవచ్చన్నారు. ఫ్లోర్‌సెంట్, ఇన్‌కాండిసెంట్ స్టానంలో ఎల్‌ఇడి లైట్లు వినియోగించి విద్యుత్‌ను ఆదాయ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఇండిస్టియల్ ప్రమోషన్ ఆఫీసర్ నాగేంద్ర భూపాల్, ఫ్రిజమ్ జాన్సన్ హెచ్‌ఆర్ మేనేజర్ టి.ఈశ్వర్, రుద్రా టెక్నో ఎజిఎం ఎ.కృష్ణారెడ్డి, ఎలక్రికల్ ఇంజినీర్ టి.రాజేష్, ఎ.చంద్రశేఖర్, పి.రాజేష్ పాల్గొన్నారు.










