ప్రజాశక్తి-అనకాపల్లి
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఇండిస్టియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎస్‌ఐ అనుమతి పొందిన యంత్ర సామాగ్రిని వినియోగించాలన్నారు. అచ్యుతాపురం పారిశ్రామికవాడలో అత్యాధునిక అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని, సిఎస్‌ఆర్ నిధులతో దానిని నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. పరవాడ ఫార్మాసిటీ హబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఆరు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌కు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల అధికారి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 25 పరిశ్రమలకు ఆరు కోట్ల 80 లక్షలు ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రతినిధి కృష్ణన్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఐఎస్‌ఐ ప్రమాణాలు వివరించారు. సమావేశంలో జెసి కల్పనా కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ, ఎంఎస్‌ఎంఇ డైరెక్టర్ నదియా, డిఆర్డిఏ పిడి లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి, జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్, జిల్లా భూగర్భ జల అధికారి శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక దళ అధికారి లక్ష్మణ స్వామి, విఎంఆర్‌డిఏ మేనేజర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










