Sep 13,2023 22:15

విలేకర్లతో మాట్లాడుతున్న కెఎ పాల్‌

ప్రజాశక్తి - పూసపాటిరేగ :  కాలుష్యం కోరలు నుంచి ప్రజలను కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌ అన్నారు. బుధవారం శ్రీకాకుళంనుంచి వస్తూ కందివలస గెడ్డ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా డాక్టర్‌ రెడ్డీస్‌ల్యాబ్‌, అరబిందో పరిశ్రమలు సంవత్సరానికి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు సదుపాయాలకు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కాలుష్యం ఇక్కడ ప్రజలది. సంపాదన ఎక్కడి వారికో వెళ్తుందని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదన్న సంగతి నిరుద్యోగులు గ్రహించాలన్నారు. తాను పోరాటం చేస్తే ఫలితం వచ్చేవరకూ ఆపేది లేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ విషయం మీకందరికి తెలిసిందే కదా అన్నారు. తాను కూడా ఈ ప్రాంతం వాడినేనన్నారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో మా తల్లిదండ్రులు పుట్టారన్నారు. తాను చిట్టివలసలో పుట్టానన్నారు. తనకు ఈ ప్రాంతానికి విడదీయలేని బందం ఉందన్నారు. ఈ ప్రాంతానికి ఈ పరిశ్రమలు వల్ల ఒక్క శాతం లాభం లేదన్నారు. సరియైన రోడ్లులేవు, స్వచ్చమైన గాలిపీల్చుకోవడానికి అవకాశం లేదని అన్నారు. ప్రజలుకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తానన్నారు. మెజార్టీ ప్రజలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో మార్పు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు, జగన్మొహన్‌రెడ్డి దోచుకున్న వారని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. జగను తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్ధితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు సీమాంద్రను సింగపూర్‌ చేస్తానన్నారని, ఇందంతా రాజకీయ నాటకమేనని అన్నారు. ప్రజల్లో మార్పు రావాలని, బిజెపి తొత్తులందరికీ బుద్ది చెప్పాలని అన్నారు.