ప్రజాశక్తి - వేటపాలెం
పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్ధులు నైపుణ్యం అభివృద్ది చేసుకోవాలని కాప్ జెమిని సీనియర్ అసోసియేట్ పివి సురేష్‌బాబు తెలిపారు. ఎంబిఎ విద్యార్ధులకు శాప్ మాడ్యూల్స్ పై ఆయన అతిధి ఉపన్యాసం చేశారు. ఎంబిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులతో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం అభివృద్ది చేసుకుంటే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ఎంబిఎ హెచ్‌ఒడి ఆర్ ఇమ్మానియేల్, ఎస్ చాంద్‌బాషా పాల్గొన్నారు.










