ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని ఏఎల్‌పురం మేజర్ పంచాయతీ ఎస్సీ కాలనీ, పాతవీధిలో పీహెచ్‌సి వైద్యులు ప్రవీణ్, హెచ్‌ఈ పార్వతమ్మ, సూపర్‌వైజర్ మహాలక్ష్మీ శుక్రవారం పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్ పెదపూడి శివ సత్యనారాయణ, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.
గ్రామాల్లో డ్రై డే
ప్రజాశక్తి-పాయకరావుపేట:మండలంలోని శ్రీరాంపురం పి.హెచ్.సి పరిధిలోని 10 గ్రామ సచివాలయాల్లో ఫ్రై డే డ్రైడేను మెడికల్ ఆఫీసర్లు కావ్య, తులసి నవీన నిర్వహించారు. దోమల వృద్దిని అరికట్టాలని సూచంచారు. టైర్లు, ఫ్రిడ్జ్ తొట్టెలు, ఎయిర్ కూలర్లు, కొబ్బరి బొండాలు, సిమెంట్ గోళాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు.










