Oct 01,2023 21:33

కాలువలో మురికిని తొలగిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  స్వచ్ఛత హీ సేవాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక డాక్టర్‌ సన్యాసిరాజు స్మారక పురపాలక ఉద్యానవనంలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్క్‌లో చెత్తను శుభ్రం చేయడం, కాలువల పూడిక తీయడం కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రహారీ గోడలకు రంగులు, చెట్టు చుట్టూ ఉన్న దిమ్మలకు సున్నం వేసి ఆహ్లాదకరంగా తయారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంఘంగా ఏర్పడి శ్రమదానం చేయడం వల్ల మన పరిసరాల్లో ఉండే ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాలు సామాజిక బాధ్యతగా శుభ్రం చేయవచ్చని తెలిపారు. అనంతరం ఉద్యానవనం నుండి చర్చి వీధి చివరి వరకు అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి, స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసి, కాలువల్లో పేరుకు పోయిన పూడికలను తొలగించి స్ఫూర్తిని, ప్రేరణను కల్పించారు. ఉద్యానవనం ఆవరణంలో ముగ్గులు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోను గౌరీశ్వరి, రెడ్‌ క్రాస్‌ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ మంచిపల్లి శ్రీరాములు, పురపాలక సంఘం కమిషనర్‌ జె.రామఅప్పల నాయుడు, సచివాలయ సిబ్బంది, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వీటితో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోవింద రావు సీతానగరం మండలం పెద భోగిలిలో స్వచ్ఛత హీ సేవ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్‌ఐబి ఆధ్వర్యాన
భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక పట్టణ రైల్వే స్టేషన్‌ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. కార్యక్రమములో స్టేట్‌ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎ.ఎ.హసీబ్‌, చీఫ్‌ మేనేజర్‌ ఎం.రవి శంకర్‌ ప్రసాద్‌, ఎల్‌డిఎం జెఎల్‌ఎన్‌ మూర్తి, ఇతర ఎస్‌బిఐ బ్రాంచ్‌ మేనేజర్లు, సిబ్బంది. టౌన్‌ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ మహేష్‌ పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : గ్రామాలలో పారిశుధ్యం బాధ్యత కేవలం స్థానిక ప్రభుత్వాలదే కాదని, గ్రామస్థులు కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని పెదబొండపల్లిలో స్వఛ్యత హై సేవా కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన స్వచ్చంధ పారిశుధ్ద్య పనులలో పాల్గొన్న ఆయన వీధిల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి స్వయంగా పారిశుధ్య పనులు నిర్వహించి, కాలువల్లో మురుగు తొలగించారు.
సాలూరురూరల్‌ : స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని బాగువలస పరిసరాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు శుభ్రం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాగాన రామునాయుడు ఆధ్వర్యాన పాఠశాల ఆవరణలో ఉన్న విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా హి పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.
కురుపాం : స్థానిక మేజర్‌ పంచాయతీ కురుపాంలో సర్పంచ్‌ జి.సుజాత ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, ఎంపిడిఒ వివి శివరామప్ప ముఖ్య అతిథిలుగా హాజరై శివన్నపేట పరిసరాలను ప్రాంతాలను చీపురు పట్టి పరిశుభ్రపరిచారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, పిఒపిఆర్‌డి, ఎంపీటీసీ టీవీఎస్‌ స్వామియోజులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని వాటరషెడ్‌ పరిధిలో ఉన్న ఎల్విన్‌ పేట మైక్రో వాటర్‌ షెడ్‌ ఎస్‌కె పాడు నర్సరీలో నిర్మాణంలో అమృత సరోవర్‌ వద్ద ఎంపిడిఒ సాల్మన్‌ రాజు, సర్పంచి ఆర్‌ చైతన్య స్రవంతి, వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోలినాయుడు మొక్కలు నాటారు. డుమ్మంగి పంచాయితీ గుణదలో యువత, మహిళలు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, ప్రజారోగ్యాన్ని కాపాడతామని గ్రామంలో ప్రతిజ్ఞ చేశారు. ప్రజలను చైతన్య పరుస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో ఇరిడి ఎంపిటిసి కడ్రక మల్లేశ్వరరావు, కార్యదర్శి డి నాగరాజు ఉన్నారు. జియమ్మవలస మండలం పెద్దబుడ్డిడిలో సర్పంచి శీమల సుజాత ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్తులు ఆ రోడ్లపై శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బాబు, భువన్‌ మోహన్‌ రావు ఉన్నారు.
భామిని : మండలంలోని మనుమకొండ పంచాయతీలో స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా మనుమకొండ సర్పంచ్‌ నిమ్మల కేశవలో రోడ్లను ఊడ్జి, పరిసరాల్లో చెత్తను తొలిగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
సీతంపేట: స్థానిక ఏరియా హాస్పిటల్‌లో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచారు. అలాగే టిటికిపాయిలో ఎంపిపి ఆదినారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎ.లిల్లిరాణి ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం : స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో జియమ్మ వలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి విద్యార్థులు తొలగించి పరిశుభ్రత పరిచారు. అనంతరం మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షిస్తామని, పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వార్డెన్‌ రాజేంద్రప్రసాద్‌, డ్రాయింగ్‌ టీచర్‌ రుగడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వీరఘట్టం : ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో స్వచ్ఛత సేవపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, పంచాయతీ ఈఒ వి రామచంద్రరావు, బి.మాణిక్య చంద్రశేఖర్‌, బి.లక్ష్మీనారాయణ, కె.ప్రేమ్‌ భూషణరావు, సత్యారావు, డి.లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని గొట్టివలసలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌. పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జి.పైడితల్లి, ఇఒపిఆర్‌డి లెంక గోపాలరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.