Oct 01,2023 17:39

వీధులు శుభ్రం చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్‌ తారిఖ్‌ .. ఏక్‌ ఘంటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల పరిషత్‌ అభివద్ధి అధికారి కన్నం హేమలత, పంచాయితీ రాజ్‌, రూరల్‌ డెవలప్మెంట్‌ విస్తరణ అధికారి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పేడూరు పంచాయితీలో చెత్త నుండి సంపద కేంద్రం వద్ద స్వచ్ఛత హి సేవ కార్యక్రమం లో భాగంగా ఏక్‌ తారీక్‌ - ఏక్‌ గంటా కార్యక్రమం క్రింద మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత మరియు శ్రమదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపిడిఒ మాట్లాడారు. ఒక్క గంటపాటు పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్‌లు, పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య సంస్థల సమీపంలోని వ్యర్థాలను తొలగించారు. పంచాయితీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.