ప్రజాశక్తి - ఆగిరిపల్లి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమలను నివారించటంతో పాటు, పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని ఆగిరిపల్లి సర్పంచి చవటపల్లి లక్ష్మీ విక్టర్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె దోమల నివారణకు ఉపయోగించే నూతన ఫాగింగ్ మిషన్ ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో భాగంగా ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి జె.జగన్మోహానరావు, సబ్‌యూనిట్ అధికారి జె.యలమంద, ఇఒపిఆర్‌డి బి.ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు కె.సంగమయ్య, సిహెచ్.పుల్లారావు, గ్రామ ప్రముఖులు విక్టర్‌బాబు, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.










