Apr 26,2023 20:48

అధికారులతో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ రామగిడ్డయ్య

ప్రజాశక్తి - హోళగుంద
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని డిఎంహెచ్‌ఒ రామగిడ్డయ్య తెలిపారు. బుధవారం మండలంలోని నెరణికి గ్రామంలో ఆయన పర్యటించారు. గత రెండు రోజుల క్రితం నెరణికి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు వాంతులు, విరోచనాలతో ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందారు. సమాచారం అందుకున్న ఆయన గ్రామానికి వచ్చి ప్రజలతో, వైద్య సిబ్బందితో మాట్లాడారు. విరోచనాలు ఎందుకయ్యాయని, తాగునీటి వల్లా, లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సక్రమంగా రావడం లేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన ఫోన్‌ ద్వారా ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. వైద్య సిబ్బందికి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి చికిత్స చేయాలని తెలిపారు. ప్రథమ వైద్యాధికారి న్యూటన్‌ పాల్గొన్నారు.