Oct 07,2023 20:43

డెస్ట్‌బిన్‌లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కడుబండి

ప్రజాశక్తి - కొత్తవలస : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో డస్ట్‌ బిన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గృహిణి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రోగాలు దరిచేరవన్నారు. ఇంటి వద్ద వాడే చెత్తాచెదారంను డస్ట్‌ బిన్నిలో వేసి పంచాయితీలకు సహకరించాలని కోరారు. పంచాయతీ ఆవరణాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలం శెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, జేసిఎస్‌ ఇంచార్జ్‌ బొంతల వెంకట్రావు, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, సర్పంచులు పీతల కృష్ణ, భూసాల దేవుడు, సంతపాలెం బి.ఎ.నాయుడు, వెలగల రమణ, వైసిపి నాయకులు మదిన అప్పలరమణ, చిన్నిపాలెం పవన్‌, రామకృష్ణ మండల పరిషత్‌ కార్యాలయం సిబ్బంధి, పాల్గొన్నారు.