ప్రజాశక్తి-చీపురుపల్లి : పరిసరాల పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పిచ్చి మొక్కలను, వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి నిర్మలాదేవి, ఎంపిపి ఇప్పిలి వెంటక నర్సమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ఉప సర్పంచ్ బెల్లాన శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఎస్‌బిఐ ఆధ్వర్యాన..
విజయనగరం కోట : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్వచ్చత హీ సేవ కార్యక్రమంలో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంకు అధికారులు శ్రమదానం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆసుపత్రి ఆవరణలో పరిసరాలను శుభ్రపరిచారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. అప్పల నాయుడు, ఎల్.డి.ఎం. శ్రీనివాస రావు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.










