ప్రజాశక్తి - చింతలపూడి
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటానికి అందరూ సహకరించాలని చింతలపూడి నగరపంచాయతీ కమిషనర్ ఎన్.రాంబాబు తెలిపారు. ఆయన తపన ఫౌండేషన్ ఛైర్మన్ తపన చౌదరిని నగర పంచాయతీ పరిధిలో చెత్తను సేకరించేందుకు రిక్షాలు కావాలని కోరగా, తపన చౌదరి తన సొంత నిధులతో ఆరు చెత్తను సేకరించే రిక్షాలను పంచాయతీకి బహుకరించారు. అనంతరం తపన చౌదరి మాట్లాడుతూ దేశమంతటా స్వచ్ఛభారత్ నినాదంతో ప్రధానమంత్రి మోడీ నగరాలు, పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా నా వంతు సహాయ సహకారాలు పంచాయతీ వారికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు చిదరాల, మధుబాబు పాల్గొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం ఎంతో ఆనందంగా ఉంటుందని తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సితరామచౌదరి తెలిపారు. కొవ్వురుగూడెం ముత్యాలమ్మ తల్లి గుడికి తపన చౌదరి తపన పౌండేషన్ ద్వారా రూ.50 వేలు -విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు, టిడిపి నాయకులు అంకంరాజు పాల్గొన్నారు.










